యుగంధర్ ముని దర్శకత్వంలో ఆది సాయికుమార్, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘శంబాల’. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్మెంట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టైటిల్ పోస్టర్‌తోనే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ మూవీలో ఆది జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడు. డిఫరెంట్ స్టోరీ లైన్‌తో ప్రభాస్ ‘కల్కి’లోని కొత్త ప్రపంచం శంబాలాను ఈ మూవీకి టైటిల్‌గా పెట్టడం విశేషం.