వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో గిరి కృష్ణ కమల్ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘శారీ’. ఇందులో శ్రీలక్ష్మి సతీష్ అలియాస్ ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఐ వాంట్ లవ్ ఫరెవర్’ అంటూ సాగే మొదటి పాట విడుదలైంది. ఇక ఈ సినిమా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోందని ఇదివరకే మేకర్స్ తెలిపారు.