టాలీవుడ్ మూవీ అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీకి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రానికిగానూ అవార్డును సొంతం చేసుకున్నారు. తాజా చిత్రం ది మెహతా బాయ్స్లో నటనకు ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. బోమన్ అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. టోరంటోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఏషియా కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు.