Sreeleela: తెలుగు చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు శ్రీలీల. ఇప్పుడు ఏ మూవీ చూసినా శ్రీలీల పేరే వినపడుతోంది. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అన్ని సినిమాల్లోనూ ఆమె నటిస్తోంది. ఆమె చేతిలో దాదాపు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అందరూ హీరోలు తమ సినిమాల్లో శ్రీలీలే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయా సినిమాల్లో నటిస్తూ, అదరగొడుతోంది. ఆమె యువ హీరో సినిమాకి కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది.
పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా తన చిన్న కొడుకు సిద్ధార్థ్ గల్లాను హీరోగా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని భావిస్తున్నాడు. సిద్ధార్థ్ గల్లా సోదరుడు అశోక్ గల్లా ఇప్పటికే రంగ ప్రవేశం చేశాడు. జయదేవ్ గల్లా తన చిన్న కొడుకు కెరీర్‌ని ప్రారంభించేందుకు కె రాఘవేంద్రరావును సంప్రదించాడు.
సిద్ధార్థ్ గల్లా కోసం రాఘవేంద్రరావు ఓ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు. అతను సినిమాను స్వయంగా పర్యవేక్షించడు; బదులుగా, అతని సహాయకులలో ఒకరు దీనికి దర్శకత్వం వహిస్తారు.‘పెళ్లి సందడి’తో శ్రీలీలని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన రాఘవేంద్రరావు ఇప్పుడు సిద్ధార్థ్ సినిమాలో కూడా ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు.
ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్స్‌తో వర్క్ చేస్తోన్న శ్రీలీల కొత్త హీరోలతో నటించడానికి ఒప్పుకుంటుందా అనే సందేహాలు మొదలౌతున్నాయి. రాఘవేంద్రరావు అడిగితే ఆమె కాదు అనదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.