మేమంతా బాగానే ఉంటాం.. మా మధ్య మంచి రిలేషిన్ ఉంటుంది.. కానీ మీరు మీరే కొట్టుకు చస్తుంటారు.. అని అభిమానులను ఉద్దేశించి.. ప్రతి హీరో చెప్పే మాట ఇదే. కానీ మేమింతేగా.. మారము అంటే మారం.. అవసరమైతే ఏదైనా చేస్తాం.. ఇది ఫ్యాన్స్ వెర్షన్. అయితే ఒకప్పుడంటే డైరెక్ట్‌గా వాదించుకునేవారు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటోంది. తమ అభిమాన హీరో గురించి అలా ఏదైనా పోస్ట్ చేయడమే ఆలస్యం.. కౌంటర్‌గా వేల ట్వీట్స్ పడిపోతాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కూడా ప్రతీ విషయంలోను పోటీ పడుతున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్, రిలీజ్ డేట్.. ఇలా అన్నీ విధాలుగా మేకర్స్ నువ్వా నేనా అంటున్నారు. అదే ఇప్పుడు ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇస్తోంది. అందుకే మరింతగా రెచ్చిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు గట్టిగా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున బెట్టింగ్ కూడా నిర్వహిస్తున్నారట. ఏ హీరోకి ఎక్కువ థియేటర్స్ దక్కుతాయి, ఫస్ట్ డే ఓపెనింగ్ కలక్షన్స్ ఎంత, టోటల్ ఎంత వసూలు చేస్తుంది, సంక్రాంతికి ఎవరిది పై చేయి.. అనే విషయాలపై ఇప్పటి నుండే బెట్టింగులు మొదలైనట్టు టాక్. అంతేకాదు కటౌట్ హైట్ విషయంలోను పోటీ పడుతున్నారట. అలాగే రిలీజ్ రోజు హైయ్యెస్ట్ టిక్కెట్ ఎవరికి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. అడ్వాన్స్ బుకింగ్స్‌లోను తగ్గేదేలే అంటున్నారట. అయితే బెట్టింగ్ మాత్రం కాస్త గట్టిగానే ఉన్నట్టు టాక్. మామూలుగానే సంక్రాంతి అంటేనే బెట్టింగ్.. పైగా చిరు, బాలయ్య సినిమాలంటే ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే.. వీరసింహారెడ్డి జనవరి12 రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. వాల్తేరు వీరయ్య విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి వీరయ్య, వీరసింహారెడ్డిలో ఎవరు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారో చూడాలి.