Story of Kerala : బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న’ది కేరళ స్టోరీ’
ది కేరళ స్టోరీ (Story of Kerala) .. ఇప్పుడు అందరూ ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నారు. విమల్ షా నిర్మాణంలో .. సుదీప్తో సేన్ దర్శకత్వంలో ఈ నెల 5వ తేదీన ఈ సినిమా విడుదలైంది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, కంటెంట్ పరంగా కొన్ని అభ్యంతరాలను ఎదుర్కొంటోంది.
కేరళ స్టోరీ (Story of Kerala) వీకెండ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే టోటల్ గా నెట్ కలెక్షన్ దాదాపు 150 కోట్లకు వసూలు చేసింది. సుదీప్తో సేన్ (Sudeepto Sen) చిత్రం ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ తో దూసుకుపోతుంది. రెండో వారాంతంలో ఈ సినిమా 150 కోట్లకు చేరువలో వసూళ్లు రాబట్టింది. కేరళ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster hit) కొట్టింది. విడుదలైన రెండవ సోమవారం చక్కగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కేరళ స్టోరీ రెండవ స్థానానికి చేరుకుంది. గతంలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘పఠాన్’(Pathan) చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా మొదటి ప్లేస్ లో నిలిచింది.
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, కంటెంట్ పరంగా కొన్ని అభ్యంతరాలను ఎదుర్కొంటోంది. ఒక వైపున ఈ సినిమాకి విమర్శలు .. వివాదాలు ఎదురవుతూ ఉంటే, మరో వైపున వసూళ్లు పెరుగుతూ వెళ్లడం విశేషం. నిన్న ఒక్క రోజులోనే ఈ సినిమా 10 కోట్లను వసూలు చేసింది. దాంతో 11 రోజుల్లో ఈ సినిమా 147 కోట్లను రాబట్టినట్టు అయింది. 200 కోట్ల మార్కును ఈ సినిమా అందుకోవడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదా శర్మ (Ada Sharma) సిద్ధి ఇద్నాని యోగిత , సోనియా ,దేవదర్శిని ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏ రోజుకు ఆ రోజు ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వెళుతున్న నేపథ్యంలో, లాంగ్ రన్ లో వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించవచ్చని అంటున్నారు. మరి ఈ వసూళ్ల వరద ఎక్కడ ఆగుతుందనేది చూడాలి.