ప్రస్తుతం రష్మిక మందన్న నటిస్తున్న సినిమాలేవి విడదుదలకు సిద్దంగా లేవు. విజయ్ సరసన నటిస్తున్న’వారసుడు’ మూవీ సంక్రాంతికి రాబోతోంది.. దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా ఉన్నట్టుండి రష్మిక ఎందుకు ఎమోషనల్ పోస్ట్ చేసింది.. ట్రోల్స్ పై ఎందుకు రియాక్ట్ అయిందనే చర్చ జరుగుతోంది. ‘మొదటి నుంచి తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని.. తన గురించి ఉన్నవి, లేనివి రాస్తున్నారని.. ఇన్ని రోజులు పోనిలే వదిలేశానని.. దీనివల్ల తన సన్నిహితులకు ఇబ్బంది కలుగుతోందని.. ఇన్నాళ్లు వాటిపై మాట్లడకుండా తప్పు చేశానని.. సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ చేసింది రష్మిక. దాంతో అమ్మడు సడెన్‌గా ఎందుకు ఫీల్ అయిందని ఆరా తీయగా.. అసలు కారణం వేరే ఉందని తెలిసింది. ప్రస్తుతం కాంతార మూవీ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా పై.. రజనీకాంత్‌తో పాటు చాలా మంది సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. కానీ రష్మిక మాత్రం ఈ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా తానింగా ‘కాంతార’ మూవీని చూడలేదని చెప్పుకొచ్చింది. దాంతో అమ్మడిపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. ‘కిరిక్ పార్టీ’తో నీకు లైఫ్ ఇచ్చిన రిషబ్ శెట్టి సినిమా చూడలేదా.. అని ఆమెపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రక్షిత్ శెట్టితో ప్రేమ వ్యవహారం కూడా తెరపైకి తీసుకొచ్చారు.
అలాగే ఈ మధ్య విజయ్ దేవరకొండతో షికారుకు వెళ్తోందని.. అతని వల్లే బాలీవుడ్ ఆఫర్లు కొట్టేసిందనే ప్రచారం కూడా జరిగింది. అందుకే ఇప్పుడు రష్మిక హర్ట్ అయిందని అంటున్నారు. కానీ రష్మిక వీటి వల్లే కౌంటర్ ఇచ్చిందా.. లేదా ఇంకేమైనా వేరే రీజన్ ఉందా.. అనేది ఇప్పుడే చెప్పలేం.