»Tamil Actress Vichitra Makes Casting Couch Allegations Against Balakrishna
Balakrishnaపై తమిళ నటి షాకింగ్ కామెంట్స్!
బాలకృష్ణపై తమిళ నటి విచిత్ర(Vichitra) కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడంతో తెలుగు నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు ఆమెను విశ్వసిస్తే, ఒక వర్గం ప్రజలు ఆమెను విశ్వసించడం లేదు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
Tamil actress Vichitra makes casting couch allegations against Balakrishna
బాలకృష్ణపై(Balakrishna) తమిళ నటి విచిత్ర(Vichitra) కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. గతంలో నటిగా ఉన్న విచిత్ర ప్రస్తుతం కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో ప్రముఖంగా పాల్గొంటోంది. నవంబర్ 1న కంటెస్టెంట్స్ తమ జీవితంలో ఒక మలుపు గురించి చెబుతున్నారు. ఈ సమయలో విచిత్ర వంతు రాగా..ఆమె ఒక తెలుగు చిత్రంలో పనిచేస్తున్నప్పుడు తన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ప్రస్తావించింది. దాని ఫలితంగా ఆమె 20 సంవత్సరాల క్రితం సినిమా నుంచి తప్పుకుంది. ఈ ఘటనపై యూనియన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలో తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొవడం వల్లనే సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది. 1991లో విచిత్ర చలన చిత్రంలో తన వృత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో చిత్రాలలో కనిపించింది. ఆమె విజయ్ టెలివిజన్ ప్రసిద్ధ వంట రియాలిటీ షో, ‘కుకు విత్ కోమలి 4’లో ఫైనలిస్ట్‌లలో ఒకరిగా పోటీ పడింది.
#Vichitra shares her casting couch atrocity happened at this 2001 Telugu film “Bhalevadivi Basu” ft. #Balakrishna
What is this Behaviour Mr. Nandamuri Balakrishna👎🏻👎🏻 ..??Practice what you preach..
ఆమె బిగ్ బాస్ తమిళ్ 7లో టాప్ పెర్ఫార్మర్స్‌లో ర్యాంక్ పొందింది. నిన్న నవంబర్ 21వ తేదీన 20 ఏళ్ల క్రితం సినిమా నుంచి తప్పుకోవడానికి కారణమైన కాస్టింగ్ కౌచ్(casting couch allegations) అనుభవాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఓ సినిమా చిత్రీకరణలో అగ్ర కథానాయకుడు తనను రూంకు రమ్మని పిలిచాడని విచిత్ర వెల్లడించారు. తాను వెళ్ళకపోవడంతో తనకు టార్చర్ చూపించారని, ఆ టార్చర్ తట్టుకోలేక తాను రోజుకొక రూంలో ఉండాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.
”అప్పట్లో ఆ స్టార్ హీరో సినిమా షూటింగ్ కోసం నేను వెళ్లాను. మేం ఉన్న హోటల్ జనరల్ మేనేజర్ నా భర్త. షూటింగ్ తర్వాత పార్టీ ఉందని..రావాలని ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ పార్టీలో హీరోని కలిశా. ఆయన నా పేరు కూడా అడగలేదు. ‘నువ్వు ఈ సినిమాలో నటిస్తున్నావా?’ అని అడిగారు. ‘అవును’ అని చెప్పా. వెంటనే రూంకి రమ్మని పిలిచారు. స్టార్ హీరో అలా అడిగే సరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రి నా గదికి వెళ్లి నిద్రపోయా. తర్వాత రోజు నుంచి నాకు టార్చర్ మొదలైంది” అని ‘బిగ్ బాస్’ ఇంటిలో విచిత్ర వెల్లడించారు. అయితే అర్ధరాత్రి నుంచి ఆమె ప్రకటన చర్చనీయాంశమైంది. బాలకృష్ణ పేరును ప్రత్యేకంగా తీసుకుని ఆమె భలే వాడివి బసు(bhalevadivi basu)సినిమా గురించే మాట్లాడుతోందని అందరికీ అర్థమైపోవడం గమనార్హం.