»Sushmita Sen Suffered Heart Attack In Jaipur But We Dont Know
Sushmitaకు స్ట్రోక్ వచ్చిన విషయం ఇన్ స్టలో పోస్ట్ చేస్తేనే తెలిసింది: కో స్టార్
బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌కు ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యానికి సంబంధించి కో స్టార్ వికాస్ సంచలన విషయం తెలిపారు. జైపూర్‌లో ఆర్య-3 వెబ్ సిరీస్ షూట్ సమయంలో స్ట్రోక్ వచ్చిందని వివరించారు. ఆ విషయం తమకు తెలియదని చెప్పారు.
Sushmita Sen suffered heart attack in jaipur but we don’t know
Sushmita Sen:బాలీవుడ్ నటి సుష్మితా సేన్‌కు (Sushmita Sen) ఇటీవల హార్ట్ స్ట్రోక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫిట్‌గా ఉండే ఆమెకు ఎలా గుండెపోటు వచ్చిందని అంతా ఆశ్చర్యపోయారు. ట్రీట్ మెంట్ తీసుకొని.. యోగా చేస్తోన్న సుష్మిత.. ప్రస్తుతం బాగానే ఉన్నారు. సుష్మిత (Sushmita) అనారోగ్యానికి సంబంధించి కో స్టార్ వికాస్ (vikas) సంచలన విషయం తెలిపారు. అవును.. సుష్మితకు జైపూర్‌లో ఆర్య-3 (arya-3) వెబ్ సిరీస్ షూట్ సమయంలో స్ట్రోక్ వచ్చిందని వివరించారు. దాంతో షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయిందని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు.
నలతగా ఉందని అనుకున్నామని.. గుండెపోటు వచ్చిందనే విషయం మాత్రం తెలియదని చెప్పారు. బాగోలేదని చెప్పడంతో ఆస్పత్రికి తరలించామని వివరించారు. అక్కడ పరీక్షలు చేశారని తెలిపారు. అతి కష్టం మీద ఒకరోజు షూటింగ్ చేశామన్నారు. ఆ తర్వాత షూట్ (shoot) చేయలేమని భావించి.. షూటింగ్ నిలిపివేశామని వివరించారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆర్య సీజన్-3కి షూటింగ్ పూర్తి చేశారు. ఇది రాజస్థాన్ (rajasthan) బేస్డ్‌కు చెందిన సిరీస్.. కొన్ని సన్నివేశాలు బయట కూడా చిత్రీకరించారు. కొద్ది రోజులకు సుష్మితకు (Sushmita Sen) హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం తెలిసింది. ఆమె ఇన్ స్టలో పోస్ట్ చేసిన తర్వాత అందరికీ తెలిసిందని.. అప్పటివరకు తమకు కూడా తెలియదని చెప్పారు.
ధమనుల్లో ఒకటి 95 శాతం ముసుకుపోయిందని చెప్పారు. యాంజియో ప్లాస్టీ తర్వాత ఓకే అయ్యిందని తెలిపింది. సర్జరీ తర్వాత డాక్టర్స్ సజెషన్ మేరకు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నానని వివరించింది. నడుము కింద రింగ్ పెట్టుకుని.. కాళ్లు, తలను కిందకు ఆనించడం వల్ల ప్లెక్సిబిలిటీ పెరుగుతుంది. స్ట్రెచింగ్ వ్యాయమాలు చేయమని వైద్యులు కూడా కోరారని సుష్మిత వివరించారు. అలా చేయడంతో ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పారు.
1994లో సుష్మిత సేన్ మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. త్వరాత బాలీవుడ్లో తెరంగ్రేటం చేశారు. పెళ్లి చేసుకోలేదు.. ముగ్గురు పిల్లలను మాత్రం దత్తత తీసుకున్నారు.