»Surprisingly Kollywood Has Not Taken Any Action On Mansoor Ali
Trisha: త్రిషపై దారుణమైన కామెంట్స్.. ఏమాత్రం స్పందించని మన్సూర్ అలీ..!
విజయ్ నటించిన లియో చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై పర్వాలేదనిపించింది. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటించింది. ఇద్దరూ భార్య భర్తలుగా అద్భుతంగా నటించి మెప్పించారు.
లియో చిత్రంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆంటోని దాస్ గ్యాంగ్ లో కీలక వ్యక్తిగా.. లియోకి అనుచరుడిగా మన్సూర్ నటించారు. రీసెంట్ గా మన్సూర్ అలీ ఖాన్ త్రిషని ఉద్దేశించి తీవ్ర అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారుతోంది. లియో చిత్రంలో త్రిషని రేప్ చేసే అవకాశం రాలేదు అంటూ నిరాశ పడుతున్నట్లు వ్యాఖ్యలు చేశాడు. త్రిష ఈ చిత్రంలో నటిస్తుంది అని చెప్పినప్పుడు ఆమెతో బెడ్ రూమ్ లో రేప్ సీన్ ఉంటుందని భావించా. చాలా చిత్రాల్లో నేను రేప్ సన్నివేశాల్లో నటించా. నాకేమి కొత్త కాదు. త్రిషని నా చేతులతో బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్లే సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ ఈ చిత్రంలో నాకు త్రిషతో అసలు సన్నివేశాలే లేవు అంటూ వెకిలి నవ్వుతూ కామెంట్స్ చేశాడు.
ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. త్రిష కూడా ఆ మాటలతో తాను భయపడిపోయాను అని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. కాగా ఈ కామెంట్స్ పై సినీ ప్రముఖులు అందరూ స్పందించారు. లియోలో మన్సూర్ అలీ ఖాన్‌కి దర్శకత్వం వహించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా నటికి మద్దతుగా మాట్లాడారు, కార్తీక్ సుబ్బరాజ్, గాయని చిన్మయి శ్రీపాద కూడా మాట్లాడారు.
తనపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను త్రిష ఖండించి రెండు రోజులైంది. ఈ విషయంలో లోకేష్ కనగరాజ్, పలువురు నటీమణులు, ఇతర ఇండస్ట్రీ ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పటి వరకు కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లేదా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జాతీయ మహిళా కమిషన్ ఈ సంఘటనను గమనించింది. మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది.
నటి త్రిష కృష్ణన్‌పై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యల పట్ల మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. IPC సెక్షన్ 509 B (ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా లైంగిక వేధింపులు) ఇతర సంబంధిత చట్టాలను అమలు చేయాలని DGP (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)ని ఆదేశించారు. అయితే, కోలివుడ్ మాత్రం ఆయనపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం గమనార్హం.