ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ మంచి మనసు చాటుకుంటున్న ప్రిన్స్ మహేశ్‌బాబు (Prince Mahesh Babu) బాటలోనే ఆయన కూతురు సితార కూడా నడుస్తున్నారు. ఇటీవల ఆమె ఓ జ్యువెల్లరీ షాప్(Jewelery shop)కు సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో నటించగా.. అందుకు సితార రూ. కోటి రెమ్యునరేషన్ (Remuneration) తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటి రెమ్యునరేషన్ ఎవరికి ఇచ్చారని అడగగా ‘ఛారిటీ(Charity)కి ఇచ్చా’ అని చెప్పారు. దీంతో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి మహేష్ బాబు ఫౌండేషన్(Foundation)కు తన వంతు సహాయంగా న పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్నట్లు గతంలో సితార తెలిపారు. ఈ ప్రకటనతో అంతా సితారపై ప్రశంసలు కురిపిస్తున్నారు.అంతే కాదు..మహేష్ అభిమానులు సితార (Sitara) మంచి మనసుకు మురిసిపోతున్నారు.. తమ అభిన హీరో మంచి మనసును పుణికిపుచ్చుకుందంటూ కామెంట్ చేస్తున్నారు.