SIR Movie Updates : ‘సార్’ ప్రమోషన్స్ ఖర్చు ఎక్కువట!?
SIR Movie Updates : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'సార్' మూవీ.. ఫిబ్రవరి 17న థియేర్లోకి వచ్చేసింది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించాయి. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ మూవీ.. ఫిబ్రవరి 17న థియేర్లోకి వచ్చేసింది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించాయి. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఇక తెలుగులో ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. అయితే ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతోనే అలరిస్తు వచ్చాడు ధనుష్. కానీ సార్ మూవీతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చినట్టే. ఈ సినిమా ధనుష్‌కు టాలీవుడ్ మార్కెట్ మరింత పెంచుతుందని అనుకుంటున్నారు. ధనుష్ కూడా సార్‌ను తెలుగులో గట్టిగానే ప్రమోట్ చేశాడు. మామూలుగా అయితే కోలీవుడ్ హీరోలు విజయ్, అజిత్ లాంటి వారు తెలుగులో తమ సినిమాలకు ప్రమోషన్స్ చేయరు. కానీ ధనుష్ మాత్రం అలా కాదు.. ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అటెండ్ అయి.. సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేశాడు. దాంతో ధనుష్ పై ప్రశంసలు కురిపించారు టాలీవుడ్ మేకర్స్. కానీ ఇప్పుడో న్యూస్ మాత్రం వైరల్‌గా మారింది. ధునుష్ ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ కోసం ఎక్స్ట్రా పేమెంట్ అందుకున్నట్టు తెలుస్తోంది. ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కి రెండు సార్లు వచ్చాడు ధనుష్. అందుకోసం.. రెమ్యూనరేషన్ పోను, 50 లక్షలు అదనంగా తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి వార్తల్లో నిజముందా.. అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం వరుస అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేస్తున్నాడు ధనుష్. కాబట్టి.. సార్ ప్రమోషన్స్ కోసం అదనపు బడ్జెట్ తీసుకున్నాడంటే.. నమ్మశక్యంగా లేదంటున్నారు. ఏదేమైనా ధనుష్ ప్రమోషన్స్ చేయడం సార్‌కు బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు.