Keerthy Sureshకు షాక్..ఇక ఆమె ఎవ్వరికి చెల్లెలు కాదు!
కెరీర్ స్టార్టింగ్ నుంచి హోమ్లీ బ్యూటీగా గ్లామర్ ట్రీట్‌కు దూరంగా ఉంటు వచ్చింది కీర్తి సురేష్. లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది. కీర్తికి పెద్దగా విజయాలు దక్కలేదు. మరో విషయంలో కూడా కీర్తికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం కీర్తి బ్యాడ్ సెంటిమెంట్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది.
Keerthy Suresh: మహానటి సినిమాతో అవార్డు అందుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ అవలేదు. దీంతో ఇక లాభం లేదనుకొని మహేష్ బాబు ‘సర్కారు వారిపాట’ సినిమాతో యూ టర్న్ తీసుకుంది. అప్పటి నుంచి గ్లామర్ షో చేయడానికి రెడీ అని హింట్ ఇస్తునే ఉంది. కీర్తి కేవలం లేడీ ఓరియెంటేడ్, హీరోయిన్గా మాత్రమే కాదు.. స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలిగా కూడా నటించింది. ఇదే ఇప్పుడు కీర్తికి బ్యాడ్ సెంటిమెంట్ తెచ్చిపెట్టింది. మామూలుగానే ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక్కసారి హీరోయిన్ పై ఐరన్ లెగ్ ముద్ర పడితే అంత ఈజీగా అవకాశాలు రావు. ఇలా చాలామంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోయారు. కానీ కీర్తి తన నటనతో ఇలాంటి వాటికి చెక్ పెడుతూ వస్తోంది.
ఈ బొద్దుగుమ్మ చెల్లెలిగా నటిస్తే.. ఇక ఆ సినిమా ఫ్లాప్ అని అంటున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘అన్నాత్తే’ సినిమాలో చెల్లెలి పాత్రలో నటించింది కీర్తి. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. ఇక రీసెంట్గా వచ్చిన మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమాలో చెల్లెలి పాత్రలో నటించింది కీర్తి. ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే. చిరు కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది భోళా శంకర్. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు.. ఈ రీమేక్ సినిమా ఫ్లాప్ అవడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. అందులో కీర్తి సురేష్ సిస్టర్ సెంటిమెంట్ కూడా ఓ కారణం అంటున్నారు. ఇప్పటి నుంచి కీర్తి సురేష్ స్టార్ హీరోలకు చెల్లెలుగా నటిస్తే చాలు.. సినిమా ప్లాప్ అనే అంచనాకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఇక పై ఈ ముద్దుగుమ్మ ఏ స్టార్ హీరోకి చెల్లెలు అయ్యే అవకాశం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కీర్తి కూడా ఇక పై చెల్లెలి పాత్రలకు దూరంగా ఉంటుందేమో చూడాలి.