గత కొంతకాలంగా యంగ్ హీరో శర్వానంద్.. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ సాలిడ్ హిట్ మాత్రం పడడం లేదు. అయినా సినిమా హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. ఈ క్రమంలో ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో సెప్టెంబర్ 9న.. తెలుగు, తమిళ్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. సినిమా పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. శర్వానంద్ మ్యూజిక్ కాంపిటేషన్‌లో తడబడుతూ.. గతాన్ని, అమ్మని తలుచుకుంటున్నట్టు ఈ ట్రైలర్ మొదలైంది.
ఇందులో బ్రోకర్‌గా వెన్నెల కిషోర్.. పెళ్ళి కోసం ట్రై చేస్తున్నట్టు ప్రియదర్శిని కనిపించారు. సైంటిస్ట్‌గా నాజర్.. టైం ట్రావెల్ మిషన్‌తో ఈ ముగ్గురిని తిరిగి బాల్యంలోకి పంపించినట్టు చూపించారు. ఇక పాస్ట్‌లో మళ్లీ తల్లిని కలుసుకున్న శర్వా ఏం చేశాడు.. అసలు గతంలో ఈ ముగ్గురికి ఏం జరిగింది.. తిరిగి అనుకున్నది సాధించారా.. అనేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇందులో తల్లీ కొడుకుల మధ్య బాండింగ్ ఎమోషనల్‌గా చూపించినట్టు తెలుస్తోంది. శర్వా తల్లిగా అమల అక్కినేని నటించగా.. హీరోయిన్గా రీతూవర్మ నటించింది. అయితే ఈ మధ్య కంటెంట్ ఉన్న సినిమాలే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలో సరైన కంటెంట్‌తో ‘ఒకే ఒక జీవితం’ రాబోతోందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో శర్వా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
ఆర్ ఎక్స్ 100 తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి లేటెస్ట్ ఫిల్మ్ 'మంగళ వారం(Mangalavaram)' ఎట్టకేలకు ఈ వారం ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో.. హీరో రేంజ్ క్యారెక్టర్ ఒకటి దాచి ఉంచారు. ఆ ప్లేస్‌లో యంగ్ హీరో ఉండి ఉంటే.. సినిమా గ్రాఫ్ మారి ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.