»Shahrukh Khan And Suhana Khan Unite For An Action Film
Shahrukh Khan:తో కలిసి యాక్షన్ సినిమా మొదలుపెట్టిన సుహానా!
షారుఖ్ ఖాన్ ఇటీవల తన కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో నటించారు. ఆర్యన్ తన తండ్రిని ఒక వాణిజ్య ప్రకటన కోసం దర్శకత్వం వహించాడు. ఈ ప్రకటన కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తన కూతురు సుహానాతో కలిసి సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.
Shahrukh Khan and Suhana Khan unite for an action film
ఇటీవల పఠాన్, జవాన్ మూవీతో హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్(Shahrukh Khan) ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఓకే అయిపోయిందని, షారుఖ్‌కి కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్(Suhana Khan)ని కూడా ఎంపిక చేశారు. ఇది పూర్తిగా యాక్షన్ మూవీ కావడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘కింగ్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. వార్, పఠాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం జనవరి 2024 నుంచి సెట్స్‌పైకి వెళుతోంది. షారుఖ్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్‌ను సిద్ధార్థ్ ఆనంద్, మార్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మిస్తోంది.
ఈ కింగ్‌లోని యాక్షన్ ఫ్లేవర్ పఠాన్, జవాన్లలో SRK చేసిన దానికి చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రం చాలా ఛేజ్ సీక్వెన్స్‌లను కలిగి ఉంటుందని, చాలా మలుపులు కలిగి ఉంటుందని సమాచారం. ఎమోషనల్ గా కూడా కథ సాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సుహానా తన వెబ్ సిరీస్ ‘ఆర్చీస్(the archies)’ ప్రమోషన్లతో బిజీగా ఉంది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ది ఆర్చీస్ వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సుహానాతో పాటు ఈ చిత్రంలో జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటించనున్నారు. సుహానా ప్రస్తుతం జోయా అక్తర్ దర్శకత్వంలో ఆర్చీస్ అనే వెబ్ సిరీస్‌తో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్, సుహానా ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారు.