టాలీవుడ్(Tollywood) డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆర్జీవీ(RGV) మేనమామ, ప్రముఖ నిర్మాత మధు మంతెన తండ్రి మురళీ రాజు మంగళవారం కన్నుమూశారు. తెలుగులో పలు సినిమాలకు మధు మంతెన నిర్మాత(Producer)గా వ్యవహరించారు. మధు మంతెన బాలీవుడ్(Bollywood)లో కూడా పలువురు నిర్మాతలతో కలిసి విజయవంతమైన సినిమాలను తీశారు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో గజినీ, ఉడ్తా పంజాబ్, సూపర్ 30, రమన్ రాఘవ్ వంటి సినిమాలున్నాయి.

రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) అండదండలతో మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మధు మంతెన అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, విక్రమాదిత్య మోత్వానీ వంటివారితో కలిసి మంచి సినిమాలు రూపొందించారు. తాజాగా అల్లు అరవింద్(Allu Aravind)తో కలిసి మూడు భాగాలుగా 3డిలో రామాయణం(Ramayanam) మూవీని తెరకెక్కిస్తున్నారు.
తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram)తో కలిసి 3డి రామాయణం సినిమాకు సంబంధించిన మాటలు, స్క్రీన్ ప్లేను పూర్తి చేసినట్లు సమాచారం. ఇకపోతే ఆర్జీవీ(RGV) విషయానికొస్తే వచ్చే రెండు మూడు నెలల్లో ఓ సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ కథాంశాలనే తీసుకుని సినిమాలు(Movies) రూపొందించనున్నట్లు గతంలోనే ఆర్జీవీ(RGV) ప్రకటించిన సంగతి తెలిసిందే.