మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా టైటిల్ ఖారారు అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఈరోజు పూజతో మొదలైంది. ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే పేరు ఖరారు చేసింది. నామ్ తో సునా హోగా అనేది ట్యాగ్ లైన్. ఆ పేరకు చిత్రబృందం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. టైటిల్ బాగుందని నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. రవితేజ అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని. ఈ విషయాన్ని స్వయంగా రవితేజ చాలా సందర్భాల్లో తెలియజేశారు. సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దీనిని చూస్తే అమితాబ్ బచ్చన్ ఐకానిక్ పోజ్ గుర్తుకు వస్తుంది. అయితే ఈ సినిమాలో అమితాబ్ అభిమానిగా రవితేజ కనిపిస్తారా? లేదంటే సినిమా ప్రేమికుడిగానా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
బ్లాక్ బ్లస్టర్ డైరక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. 12 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ వస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నది. తెలుగులో ఆమెకు ఇది మొదటి చిత్రం. ఇంతకు ముందు హీందీలో యూరియాన్ 2 సినిమాలో నటించారు. మాస్ మహారాజా కా క్లాస్ మహారాణి అంటూ.. హరీష్ శంకర్ ఆమెను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.