ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘ధమాకా’, ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలన్నీ జెట్ స్పీడ్‌తో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. వీటిలో ముందుగా ధమాకా చిత్రం రిలీజ్ కానుంది. ఇక రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న మెగాస్టార్ 154 కూడా సెట్స్ పైనే ఉంది. అయితే ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాది ఎండింగ్ వరకు పూర్తి కానున్నాయి. దాంతో రవితేజ వరుస పెట్టి కొత్త ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఓ సినిమా చేతిలో ఉండగానే రెండు, మూడు సినిమాలను మొదలు పెడుతున్నాడు రవితేజ. ఈ నేపథ్యంలో ముగ్గురు దర్శకులకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనితో ఓ సినిమాకు కమిట్ అయినట్టు వార్తలొచ్చాయి.
అలాగే ప్రస్తుతం గోపీచంద్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడు శ్రీవాస్‌తో కూడా ఓ సినిమా ఉంటుందని టాక్. ఇక ఇప్పుడు సుధీర్ వర్మతో మరోసారి కలిసి వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘రావణాసుర’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు సుధీర్ వర్మ. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీం వర్క్స్ బ్యానర్లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సుధీర్ వర్మ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారట. రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించడబోతున్నాడట. దాంతో సుధీర్ వర్క్ నచ్చి.. మాస్ రాజా మరోసారి అతనికి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. ఇప్పటికే కథా చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. వచ్చే ఈ ఏడాది రవితేజ ఈ మూడు ప్రాజెక్టులతో బిజీగా మారనున్నాడని చెప్పొచ్చు.