సత్యసాయి: పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు జరుగుతాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. మొదటి బహుమతి రూ.10వేలు, రెండో బహుమతి రూ.5వేలు, మూడో బహుమతి రూ.3వేలు అందజేస్తామని మంత్రి తెలిపారు.