Rashmika Mandanna: నా ఆకలి తీరింది..రష్మిక కామెంట్స్ వైరల్
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన రష్మిక(Rashmika Mandanna). ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న అనిమల్ సినిమా హిట్ అవడంతో అమ్మడు ఫుల్ ఖుషీ అవుతోంది. దీంతో తన ఆకలి తీరిపోయిందని అంటోంది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా(Rashmika Mandanna) క్యూట్‌నెస్‌కు ఛలో సినిమా నుంచే కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక..ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’ షూటింగ్‌తో బిజీగా ఉంది అమ్మడు. అలాగే ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాతో పాటు..రెయిన్బో అనే లేడీ ఓరియెంటేడ్ సినిమా కూడా చేస్తోంది. మొన్ననే ‘ది గర్ల్ ఫ్రెండ్’ షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇలా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న రష్మిక.. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’తో సాలిడ్ హిట్ అందుకుంది.
డిసెంబర్ 1న రిలీజ్ అయిన అనిమల్(animal) సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో లిప్‌లాక్, బోల్డ్ సీన్స్‌తో రెచ్చిపోయింది రష్మిక. ప్రజెంట్ ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. నటన గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నటన పరంగా అనిమల్ సినిమాలో విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో రీసెంట్గా రష్మిక మాట్లాడుతూ.. ‘ఆఫర్లు వస్తున్నాయి కదా అని.. ఎలా పడితే అలా సినిమాలు చేయను..నాకు కథ నచ్చాలి. పాత్ర నచ్చాలి. ఆ సినిమాకు పనిచేసే వ్యక్తులు కూడా నచ్చాలి.. ఆ తర్వాతే రెమ్యునరేషన్‌కు ఇంపార్టెర్స్ ఇస్తానని చెప్పుకొచ్చింది. అలాగే.. నా అదృష్టం చాలా బావుంది. అన్ని మంచి సినిమాలే వస్తున్నాయి. ‘అనిమల్’ సినిమా ఇచ్చిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నటిగా నా ఆకలి తీర్చిన సినిమా అనిమల్’ అని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ లెక్కన అనిమల్‌లో రష్మిక క్యారెక్టర్ అమ్మడికి ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.