Rana- Teja: దగ్గుబాటి హీరోలను డైరెక్టర్ తేజ (Teja) వదిలేట్టు లేడు. నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ తొలిచిత్రం అహింస జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ మూవీ తర్వాత తేజ (Teja) డైరెక్ట్ చేసే మూవీలో హీరో రానా (Rana) అట.. ఆ చిత్రానికి సంబంధించి కథ కూడా సిద్దంగా ఉందని.. పొలిటికల్ థ్రిల్లర్గా ఉండనుంది. వీరిద్దరి కాంబోలో నేనే రాజు నేను మంత్రి మూవీ రాగా.. సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
ఇదివరకు మూవీ చేస్తానని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్కు రానా (Rana) మాట ఇచ్చారట. ఇచ్చిన మాట మేరకు తేజతో (Teja) కలిసి సినిమా తెరకెక్కనుంది.ఈ మూవీని గోపినాథ్ ఆచార్య నిర్మిస్తున్నారు. నిజానికి ఇతర మూవీస్, ప్రాజెక్టులతో రానా (Rana) బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో పని ఉంది.. గతంలో కన్నా రెమ్యునరేషన్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు.ఆచార్యకు ఇచ్చిన మాట మేరకు తేజతో కలిసి మూవీ చేస్తున్నాడు రానా. ఈ సినిమాలో రానా (Rana) రెమ్యునరేషన్ కూడా కాస్త తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
రానాతో (Rana)మూవీ గురించి దర్శకుడు తేజ (Teja) తెలిపారు. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుతుందని చెబుతున్నారు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా లాగా మూవీ ఉంటుందని పేర్కొన్నారు. సో.. తేజ- రానా (Rana) కాంబోలో వచ్చే మూవీపై హైప్ నెలకొంది.