Rana on Rajamouli: బాహుబలి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్. బాహుబలి.. ద బిగినింగ్ మూవీ రూ.వెయ్యి కోట్ల మార్కెట్ సాధించింది. రెండుపార్టులు కలిపి రూ.2500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాను శోభు యార్లుగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించగా.. కే రాఘవేంద్రరావు సమర్పించారు. మూవీ బడ్జెట్ కూడా కూడా భారీగానే అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని నటుడు రానా (Rana) పంచుకున్నారు.
బాహుబలిని రెండు పార్టులుగా తీయడానికి రాజమౌళి (Rajamouli) చాలా కష్టపడ్డారు. రెండు భాగాలుగా తీయాలంటే బడ్జెట్ కూడా ఎక్కువే అవుతోంది. శోభు, ప్రసాద్ త్రయం వీలైనంత ఇన్వెస్ట్ చేశారు. తర్వాత మూవీ ముందుకెళ్లాలంటే బడ్జెట్ అవసరమైంది. అందుకోసం జక్కన్న రాజమౌళి (Rajamouli) రంగంలోకి దిగారని.. రానా (Rana) చెప్పారు. రానా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రాజమౌళి (Rajamouli) రూ.400 కోట్ల అప్పు తీసుకున్నారనే సంచలన విషయం తెలిపారు.
ఆ డబ్బుకు ఓ 2, 3 రూపాయల వడ్డీ కాదు.. ఏకంగా 24 శాతం చొప్పున తీసుకొచ్చారట. అంటే నెలకు రూ.96 కోట్ల వడ్డీ కట్టేశాడని రానా (Rana) వివరించారు. ఆ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఆ అప్పు మొత్తం తీర్చేశాడని పేర్కొన్నారు. అంత పెద్ద మొత్తంలో అప్పు చేసి రిస్క్ తీశారంటే.. మూవీపై తనకు ఉన్న కమిట్ మెంట్, తీస్తోన్న కథపై నమ్మకం ఉండబట్టే అని తెలుస్తోంది. ఆ మూవీ కోసం రాజమౌళి (Rajamouli) రిస్క్ చేశాడు.. కాబట్టి.. సినిమా ఆ స్థాయిలో ఆడింది. సినిమా ఖర్చులు పోను భారీగానే లాభం వచ్చి ఉంటుంది.