రీసెంట్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ సినిమాలో ఆరు నిమిషాల ఎపిసోడ్ కోసం చేసిన ఖర్చు వైరల్‌గా మారింది.
Pushpa2: ఐకాన్ స్టార్ అర్జున్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప-2 పై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్గా బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ టీజర్‌కు నెక్స్ట్ లెవల్ అనేలా రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేశాడు పుష్పగాడు. ఇక్కడి నుంచి పుష్పగాడి పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఆగష్టు 15 ఎప్పుడొస్తుంది? పుష్ప2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక అంతకుమించి అన్నట్టుగా.. ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అమ్మవారి గెటప్ సీక్వెన్స్ కోసం బన్నీ ఏకంగా 51 టేకులు తీసుకున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పుడు జాతర సీన్ కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. సినిమాలో గంగమ్మతల్లి జాతర సీన్ ఆరు నిమిషాల పాటు ఉంటుందట. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. దీంతో ఈ సీన్ కోసం మేకర్స్ ఏకంగా 60 కోట్లు ఖర్చు చేయడంతో పాటు.. 30 రోజుల పాటు షూటింగ్ జరిపారట. అందుకే.. జాతర సీక్వెన్స్‌ను టీజర్‌గా రిలీజ్ చేశారని చెప్పొచ్చు. అయితే.. ఆరు నిమిషాల కోసం 60 కోట్లు ఖర్చు చేశారంటే.. పుష్ప2 సినిమాను మేకర్స్ ఏ రేంజ్లో తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వారు సుకుమార్‌కు అన్ లిమిటేడ్ బడ్జెట్ ఇచ్చారనే టాక్ వచ్చింది. అదిప్పుడు టీజర్‌తోనే తెలిసిపోయింది. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.