డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పెన్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. పూరి సినిమాల్లో హీరోయిజం, ఆటిట్యూడ్ అంటే జనాలకు స్పెషల్ క్రేజ్. అందుకే పూరి నుంచి సినిమా వస్తుందంటే ఆటోమేటిక్‌గా హైప్ క్రియేట్ అవుతుంది. పైగా ఫస్ట్ టైం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోతాయి. లైగర్ విషయంలో ఇదే జరిగింది. కానీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టేసింది లైగర్. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో డైలమాలో పడ్డాడు. ‘లైగర్’ రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను మొదలు పెట్టాడు పూరి. రౌడీ హీరో కూడా మరోసారి జెజిఎంతో మరో దుమ్ములేపాలనుకున్నాడు. కానీ లైగర్ రిజల్ట్ పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ పై గట్టిగానే ఎఫెక్ట్ చూపించింది.
పూరి కనెక్ట్స్ మరియు శ్రీకర స్డూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని అఫీషియల్‌గా లాంచ్ చేసి.. కొంత షూటింగ్ కూడా చేశారు. అంతేకాదు ‘జనగణమన’ను పాన్ ఇండియా స్థాయిలో 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. విజయ్ సరసన పూజా హెగ్డేని హీరోయిన్గా తీసుకున్నారు. దాంతో జెజిఎంకు తీరుగులేదనుకున్నారు. కానీ ‘లైగర్’ ప్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ కారణంగానే ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ హోల్డ్‌లో పెట్టినట్టు టాక్. దాంతో పూరి మరో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పూరి నెక్ట్స్ హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రామ్‌తో మళ్లీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్టు కూడా వినిపిస్తోంది. కానీ ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేం. దాంతో పూరి ఎవరితో సినిమా చేస్తారు.. మీడియం హీరోతో చేస్తాడా.. పూరికి స్టార్ హీరోలు డేట్స్ ఇస్తారా.. అనే చర్చ జరుగుతోంది. మరి పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.