»Prabhas Who Is Ready For Marriage Do You Know Who The Girl Is
Prabhas: పెళ్లికి రెడీ అయిన ప్రభాస్… అమ్మాయి ఎవరో తెలుసా.?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ పెళ్లికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు సలార్ సినిమా కోసం ఆగిన ఆయన ఇప్పుడు తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మేరకు అమ్మాయి ఎవరు అని సోషల్ మీడియా తెగ రచ్చ జరుగుతుంది.
Prabhas: పాన్ ఇండియా(Pan india) హీరో ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇండస్ట్రీలో స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన పెళ్లి విషయంలో మాత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే కొనసాగుతున్నాడు. నాలుగు పదుల వయసు దాటినప్పటికి ప్రభాస్ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక తన పెళ్లి గురించి ఇప్పటివరకు అనేక రకాల వార్తలు వస్తున్నా.. ఒక్కసారి కూడా వారిపై స్పందించలేదు ప్రభాస్. అయితే నిజానికి బాహుబలి సిరీస్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు అని అందరూ భావించారు. కాని ఇప్పటివరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇక ఆ తర్వాత సాహో, రాధేశ్యాం, ఆది పురుష్ వంటి సినిమాల షూటింగ్లో వరుసగా బిజీ అయ్యాడు. వాటి తర్వాత ఇప్పుడు ప్రాజెక్టు కే (Project K) సలార్ వంటి సినిమాలు చేస్తున్నారు.
అయితే ఆ మధ్య కాలంలో మాత్రం ప్రభాస్(Prabhas), అనుష్క(Anushka) ఇద్దరు ప్రేమలో ఉన్నారని బాహుబలి సమయంలోనే వీరిద్దరి ప్రేమ ప్రయాణం స్టార్ట్ అయింది అన్న కథనాలు వినిపించాయి. ఇక వాటిలో ఏమాత్రం నిజముందో ఎవరికీ తెలియదు. వాళ్లిద్దరు సీక్రెట్ గా అప్పుడప్పుడు మీట్ అవుతారనే పుకార్లు కూడా వస్తునే ఉంటాయి. వాళ్ళ మధ్య ఏముంది అన్నది పక్కన పెడితే ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ పూర్తి అవడంతో పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు డార్లింగ్ ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే వధువు ఎవరు అన్నది అందరిలో ఉండే కామన్ ప్రశ్న. తాను సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదని, తన బంధువుల అమ్మాయితో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ప్రభాస్‌కు సంబందం చూసినట్లుగా తెలుస్తోంది. ఒక ఫంక్షన్ లో ప్రభాస్ పెద్దమ్మకు ఆ యువతీ తల్లిదండ్రులు ఆమె ఫోటో చూపించారట. ఆ అమ్మాయి తనకి బాగా నచ్చిందని.. ఈడు జోడు కూడా బాగుంది అని భావించిన ఆమె ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది .దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే ప్రభాస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకే వెయిట్ చేయాల్సిందే.