ఇప్పటి వరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. దాని వల్ల చెప్పలేనంత నష్టం జరిగింది. అందుకే కలలో కూడా మూడో ప్రపంచ యుద్ధాన్ని ఊహంచలేం. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం మూడో ప్రపంచ యుధ్దం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్‌లో ఇదే హైలెట్‌గా నిలవనుందని అంటున్నారు. మహానటి తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 55 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. త్వరలోనే మరో షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరపైకి తీసుకురాబోతున్నారట. అందుకోసం హాలీవుడ్ నుంచి ప్రముఖ యాక్షన్ డైరెక్టర్స్‌ను రంగంలోకి దించుతున్నారట.
ముందు నుంచి వినిస్తున్నట్టుగానే.. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్.. మహాభారతాన్ని టచ్ చేస్తూ.. మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపించేలా ఉంటుందని టాక్. అందుకే భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను.. నాలుగు వేర్వేరు యూనిట్లుగా డివైడ్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ కె అంటే ‘కల్కి’ లేదా ‘కర్ణుడు’ అనే ప్రచారంలో ఉంది. ఇక ఇప్పుడు భారీ యుద్దం ఫిక్స్ అని తెలియడంతో.. ‘ప్రాజెక్ట్ కె’ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక వైజయంతి బ్యానర్ పై 500 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో.. దీపిక పదుకొనే, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఎండింగ్ లేదా.. 2024 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.