Prabhas : ప్రస్తుతం ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఉన్నట్టుండి డార్లింగ్ అభిమానులు.. ఓం రౌత్ పై ఎందుకు పడ్డారనేది.. హాట్ టాపిక్‌గా మారింది. దానికి బలమైన రీజనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ ఆదిపురుష్.
ప్రస్తుతం ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఉన్నట్టుండి డార్లింగ్ అభిమానులు.. ఓం రౌత్ పై ఎందుకు పడ్డారనేది.. హాట్ టాపిక్‌గా మారింది. దానికి బలమైన రీజనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ ఆదిపురుష్. హిందీలో కూడా ప్రభాస్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. అందుకే ఆదిపురుష్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన తర్వాత.. చాలా కాలం సస్పెన్స్ మెయింటేన్ చేశాడు ఓం రౌత్. దాంతో మనోడు ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నాడని ఊహించుకున్నారు. కానీ తీరా టీజర్ బయటికొచ్చాక.. ఇంతకాలం ఊరించి.. ప్రభాస్‌తో యానిమేటేడ్ మూవీ తీస్తావా.. అంటూ ఫైర్ అయ్యారు అభిమానులు. దెబ్బకు సినిమాను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు ఓం రౌత్. ఫైనల్‌గా జూన్ 16న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. కానీ ఇప్పటి వరకు ఓం రౌత్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదే ఇప్పుడు ఓం రౌత్ పై ట్రోలింగ్‌కు కారణమవుతోంది. ప్రస్తుతం ట్విట్టర్లో #Wake Up OM RAUT #Start Adipurush Promotions అనే యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. రకరకాల కామెంట్స్, మీమ్స్‌తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. లేడీ రెబల్స్ కూడా ఈ ట్రెండ్‌లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు రచ్చ చేస్తున్నారు. అయితే.. ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత చేస్తున్నా.. ఇప్పటికైనా ఓం రౌత్ మేల్కొని అప్డేట్లు ఇస్తాడా.. ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా.. అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఏదేమైనా సరే.. ఆదిపురుష్‌తో ఓం రౌత్ ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.