Pavitra lokesh : పవిత్ర లోకేష్ రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా ?
పవిత్ర..నరేష్ ఈ జంట గురించి ప్రస్తుతం ఈమె తెలియని వారు ఉండరు. పవిత్ర లోకేష్(Pavitra lokesh) ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. నరేష్ తో రిలేషన్ మొదలుపెట్టాక మరింత పాపులర్ అయింది.
Pavitra lokesh : పవిత్ర..నరేష్ ఈ జంట గురించి ప్రస్తుతం ఈమె తెలియని వారు ఉండరు. పవిత్ర లోకేష్(Pavitra lokesh) ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. నరేష్ తో రిలేషన్ మొదలుపెట్టాక మరింత పాపులర్ అయింది. దాదాపు నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ కపుల్ గా మారిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో `మళ్లీ పెళ్లి`(Malli pelli) సినిమాలో నటించారు. నేడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలుగులోనే కాకుండా కన్నడ భాషలో కూడా విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, పవిత్ర చేసిన హంగామా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం నరేష్(Naresh) తో పాటు పవిత్ర పేరు మారుమోగిపోతోంది. అలాగే ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే పవిత్ర తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడిందట. ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందట.
ఇంతకుముందు సినిమాల్లో నటించేటప్పుడు ఒక్క రోజుకు రూ. 50 వేల రెమ్యునరేషన్ పుచ్చుకున్న పవిత్ర.. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుందట. అంటే పది రోజులు షూటింగ్ లో పాల్గొంటే పది లక్షలు ముట్టజెప్పాలన్నమాట. ఒక్కసారిగా పవిత్ర లోకేష్ తన రెమ్యునరేషన్ పెంచడంతో నిర్మాతలు కంగుతింటున్నారట. అయినా సరే ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు వెనకడుగు వేయడం లేదట.