మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఇప్పటికే పలువురు నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ మూవీలో నటిస్తున్న నటి ఐశ్వర్య పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆమె ‘మారెమ్మ’ అనే పాత్రలో కనిపిస్తారని తెలిపారు. ‘అడవిని పీడించే అరాచకం.. మారెమ్మ, కుతంత్రమే ఆమె మంత్రం’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
లడ్డూ వివాదంపై హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరబాద్‌లో జరిగిన ‘సత్యం సుందరం’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో లడ్డూ అంశం వచ్చింది. ‘లడ్డూ కావాలా నాయనా అంటూ ఓ మీమ్‌ను యాంకర్ చూపించారు. దాని గురించి మాట్లాడుతూ.. లడ్డూ గురించి నేను ఇప్పుడే మాట్లాడను. ఇప్పుడది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇలాంటి టైంలో మనకొద్దు’ అని చెప్పారు.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. దర్శకుడు అనుదీప్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో నటి ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక విశ్వక్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ మూవీతో బిజీగా ఉన్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో తెరకెక్కిన ‘దేవర’ మూవీ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీలా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్స్ 2 మిలియన్ డాలర్ మార్క్ దాటింది. విడుదలకు మూడు రోజులు ముందే అక్కడి బాక్సాఫీస్‌పై తారక్ దండయాత్ర మొదలైంది. ఫస్ట్ వీకెండ్‌లోనే 5M డాలర్లు రాబట్టే అవకాశం ఉంది. కాగా ఒకరోజు ముంద...
‘దేవర’ మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి హీరో ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. “దేవర విడుదల కోసం కొత్త జీవో జారీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మీరు అందిస్తున్న తిరుగులేని మద్దతుక...
తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సందడి చేశారు. ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక రద్దయినందుకు బాధపడొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న ‘దేవర’ రిలీజ్ కానుంది. ఆ సినిమాతో పాటు ఈ నెల 28న విడుదల కానున్న ‘సత్యం సుందరం’ మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించ...
దేవర టికెట్ ధరను పెంచుకునేందుకు అనుమతినిచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘దేవర సినిమా కోసం జీవో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమకు మీరు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు.’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్&z...
తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘దేవర’ మూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిమిషాల వ్యవథిలోనే టికెట్లు ఖాళీ అయ్యాయి. రేపు రెండు రాష్ట్రాల్లోని చాలా థియేటర్లలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 27న 29 థియేటర్లలో అర్థరాత్రి ఒంటిగంట షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే టికెట్లు రెట్లను పెంచుకునే వెసులుబాటును కూడా రెండు ...
రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్‌కు బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా వారిపై హత్యానేరం ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. కాగా ఈ హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులు రాష్ట్రంలోని వివిధ జైళ్లలో రిమాండ్ ...
‘దేవర’ మూవీకి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీఫ్లెక్సుల్లో రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఇక సినిమా విడుదలయ్యే సెప్టెంబర్ 27న మొత్తం ఆరు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్‌పై రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు ఇస్తూ ఉత్తర్...
తమిళ స్టార్ హీరో కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామి కాంబినేషన్‌లో దర్శకుడు ప్రేమ్ కుమార్ ‘సత్యం సుందరం’ మూవీని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్, కార్తీ.. బావ- బావమరిదిగా నటించారు. కాగా ఈ నెల 28న థియేటర్లలో ప...
నారా రోహిత్ హీరోగా నటించిన ‘ప్రతినిధి 2’ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘ప్రతినిధి’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. ప్రస్తుత రాజకీయాలను ప్రశ్నించే జర్నలిస్టుగా రోహిత్ ఇందులో నటించారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈనెల 27న స్ట్...
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, జానీ మాస్టర్‌ను కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్‌రావ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘స్త్రీ 2’ సినిమా అరుదైన రికార్డు నెలకొల్పింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకుపైగా వసూళ్లు(నెట్ కలెక్షన్స్) రాబట్టిన తొలి హిందీ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. 39 రోజుల్లో ఈ చిత్రం రూ.604.22 కోట్లు(నెట్) వసూల్ చేసిందని తెలిపింది. రూ.713 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసిందని పేర్కొంది.