ప్రముఖ నటి అదాశర్మ ప్రధాన పాత్రలో దర్శకుడు కృష్ణ అన్నం తెరకెక్కించిన మూవీ C.D (క్రిమినల్ OR డెవిల్). సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా OTTలోకి రాబోతుంది. ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్ షేర్ చేసింది. ఇక ఈ సినిమా మేలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.