OTTకి సెన్సార్ కత్తి..? అశ్లీలం ఎక్కువవడంతో కేంద్ర ప్రభుత్వం దృష్టి
ఓటీటీలో వస్తోన్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. మితిమిరీన శృంగారంపై కళ్లెం వేయాలని భావిస్తోంది. మూడంచెల సెన్సార్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది.
OTT:ఓటీటీ ( ఓవర్ ద టాప్)లో మూవీస్ (movies), షో, వెబ్ సిరీస్ (web series) వస్తుంటాయి. కొన్ని సంస్థలు సొంతంగా కూడా వెబ్ సిరీస్, మూవీస్ తీసి ప్రమోట్ చేస్తుంటాయి. వీటిలో తీసే, ప్లే చేయడానికి సెన్సార్ (censor) కత్తి ఉండదు. అందుకే అశ్లీలం ఎక్కువే. కొన్ని సిరీస్ చూసేప్పుడు ఒంటరిగా చూడాలని కోరుతున్నారు. ఇటీవల వచ్చిన రానా నాయుడు (Rana naidu) అందుకు ఉదహరణ. ఓటీటీలో విచ్చలవిడి తనంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఓటీటీలో (ott) వస్తోన్న కంటెంట్‌కు కత్తెర వేయాలని అనుకుంటోంది.
ఓటీటీలో (ott) కంటెంట్‌పై మూడంచెల (three levels) సెన్సార్‌కు సిద్దమైంది. కంటెంట్ క్రియేటర్ స్థాయిలో.. తర్వాత స్వీయ నియంత్రణ, చివరికీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నియంత్రణ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. దీనిపై పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో చర్చ జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. వెబ్ సిరీస్ (web series) గురించి సమావేశంలో చర్చ వచ్చింది. అశ్లీలం పెరగడంపై కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విధి విధానాలు రూపొందించి.. అశ్లీల కంటెంట్‌కు కత్తెర వేయనున్నారు.
ఇంగ్లీష్ మూవీస్/ వెబ్ సిరీస్ కాకుండా.. తెలుగు (telugu), హిందీలో (hindi) వచ్చే వెబ్ సిరీస్‌లో కూడా అశ్లీలం పెరుగుతోంది. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి సిరీస్ చూసే పరిస్థితి లేదు. ఓటీటీకి (ott) కళ్లెం వేయాలని చాలా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై కేంద్రం ఆలోచించి ముందడుగు వేసింది. ఇకపై వచ్చే సిరీస్‌కు (series) సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోనుంది.
కరోనా (corona) తర్వాత ఓటీటీకి (ott) మంచి డిమాండ్ వచ్చింది. వైరస్ నేపథ్యంలో బయటకు వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేదు. అప్పుడు డైరెక్ట్‌గా మూవీస్ ఓటీటీలో (ott) రిలీజ్ చేశారు. అప్పుడే జనాలు వెబ్ సిరీస్ (web series), షోలకు అలవాటు పడ్డారు. విచ్చలవిడిన శృంగారంపై ముక్కున వేలేసుకున్నారు. అప్పటినుంచి అశ్లీలం గురించి చర్చ రాగా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించింది.