Jr.NTR : ఆస్కార్ వేదిక పై కీరవాణి, చంద్రబోస్.. ఇద్దరు ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డ్‌ను చేత పట్టి.. చాలా గర్వంగా ఫీల్ అయింది ట్రిపుల్ ఆర్ టీమ్. ఆస్కార్ అవార్డ్‌తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
ఆస్కార్ వేదిక పై కీరవాణి, చంద్రబోస్.. ఇద్దరు ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డ్‌ను చేత పట్టి.. చాలా గర్వంగా ఫీల్ అయింది ట్రిపుల్ ఆర్ టీమ్. ఆస్కార్ అవార్డ్‌తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇదే క్రేజ్‌లో నెక్స్ట్ సినిమా కోసం యాక్షన్‌లోకి దిగబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ 30ని మార్చి 18న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మార్చి 29 నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం కొరటాల భారీ సెట్టింగులతో బిజీగా ఉన్నాడు. ఆస్కార్ అవార్డుల వేడుక ముగియడంతో.. రేపో మాపో ఇండియాకి తిరిగి రానున్నాడు ఎన్టీఆర్. దాంతో కొరటాల షూటింగ్‌కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30ని సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్నాడు. రీసెంట్గా రివీల్ చేసిన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా సముద్రం బ్యాక్ డ్రాప్లోనే ఉంది. అందుకే హైదరాబాద్‌లో భారీ సెట్లు వేస్తున్నారు. అయితే.. ముందుగా భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో షూట్ స్టార్ట్ చేయబోతున్నాడట కొరటాల. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేయనున్నారట. సినిమాలో ఈ ఎపిసోడ్ హైలెట్‌గా ఉంటుందని అంటున్నారు. ఇదే కాదు ఈ సినిమాలో యాక్షన్‌కే పెద్ద పీట వేయబోతున్నాడు కొరటాల. అందుకే ఎన్టీఆర్ 30 పై భారీ అంచనాలున్నాయి. పైగా ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడంతో.. ఎన్టీఆర్ 30 పై మరింత వెయిట్ పెరిగింది. కాబట్టి ఈ సినిమా అంతకుమించి అనేలా ఉంటుందనే చెప్పొచ్చు. ఈసినిమాను 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.