ప్రస్తుతం రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా టీజర్ పై ఊహించని విధంగా ట్రోలింగ్ జరిగింది. టీజర్ టాక్‌తోనే ఈ సినిమాను ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు దర్శకుడు ఓం రౌత్. ఇక ఇప్పుడు హనుమాన్ వంతు వచ్చింది. అ.. కల్కి.. జాంబిరెడ్డి.. వంటి సినిమాలు తీసిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..
ఇప్పుడు హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూపర్ హీరో ఫాంటసీ నేపథ్యంలో తేజ సజ్జా హీరోగా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. అయితే ఆదిపురుష్ టీజర్ రోజే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయానుకున్నారు. కానీ రాముడు వస్తున్నాడు కాబట్టి.. హనుమాన్ను ఆపేశాడు ప్రశాంత్ వర్మ.
రీసెంట్గా కూడా ఈ టీజర్ పోస్ట్ పోన్ అయింది. దాంతో తాజాగా మరో కొత్త డేట్‌ను ప్రకటించారు మేకర్స్. హనుమాన్ టీజర్‌ను నవంబర్ 21న మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అయితే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ టీజర్ పైనే ట్రోలింగ్ జరిగింది. అలాంటిది హనుమాన్ టీజర్ ఎలా ఉంటుందోననే ఆసక్తి అందరిలోను మొదలైంది.
టీజర్ ఏ మాత్రం తేడా కొట్టిన ట్రోలింగ్ మాత్రం ఊహించని విధంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. వచ్చే ఏడాదిలో హనుమాన్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి హనుమాన్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.