ఏ సినిమాకైనా,ప్రొడక్షన్ పనులు ఎంత ముఖ్యమో, ప్రీ-ప్రొడక్షన్ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా యదార్థ సంఘటనల ఆధారంగా తీసే సినిమాలకు మరింత అవసరం అవుతుంది. ఆ రియల్ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య సినిమా విషయంలో ఈ ప్రీ ప్రొడక్షన్ పనులపై కసరత్తులు మొదలుపెట్టారు.
నాగ చైతన్య 23 వ చిత్రం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మార్గదర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుంది. ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో నాగ చైతన్య పడవ నడిపే జాలరిగా కనిపించనున్నాడు. అందుకే ప్రీ-ప్రొడక్షన్ కోసం కొత్త విధానాన్ని అవలంబించారు. ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి, బృందం #NC23 కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌ను అన్వేషించింది. శ్రీకాకుళంలోని K మచిలేశం గ్రామాన్ని సందర్శించింది.
హైదరాబాద్‌లో కూర్చొని ఈ కథను రూపొందించకూడదని దర్శకుడు చందూ మొండేటి అనుకున్నారట. అందుకే, ఆ ప్రాంతానికి వెళ్లి, అక్కడి ప్రజలు, వారి వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ ఈ ప్రీ-ప్రొడక్షన్‌ను చాలా శ్రద్ధతో ముందుకు తీసుకెళుతున్నామని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోని కూడా విడుదల చేయడం విశేషం. ఈ గ్రామానికి వచ్చి ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని, తద్వారా వారు ఏమి చేస్తున్నారో పూర్తి అవగాహన కలిగి ఉంటుందని దర్శకుడు చందూ మొండేటి అభిప్రాయపడ్డారు.
హీరో నాగ చైతన్య కూడా వారితో పాటు ఆగ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రజలను కలుస్తూ, వారి బాడీ లాంగ్వేజ్‌ని అధ్యయనం చేయడానికి ,గ్రామం యొక్క ఆకృతిని తెలుసుకోవడానికి, వారి జీవనశైలిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.అందుకు వారు ఆ గ్రామంలోనే ఉండటం విశేషం. నిజ జీవిత కథను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకమైన విధానంగా, మత్స్యకారుల పని జీవితాన్ని అర్థం చేసుకోవడానికి బృందం #NC23 సముద్రంలోకి వెళ్లింది. మొత్తం ప్రయాణాన్ని ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ అనే డాక్యుమెంటరీగా ప్రదర్శించారు. అతను మొదటిసారి, ఒక హీరో షూట్ ప్రారంభించే ముందు లొకేషన్లను సందర్శించి వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యాడు. నాగ చైతన్య ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూ ప్రాజెక్ట్ పై తన ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నాడు.