దసరా మూవీ హిట్‌తో హీరో నాని జోష్ మీద ఉన్నాడు. తన రెమ్యునరేషన్ మరోసారి పెంచేశాడు. దసరా హిట్ అవడంతో రూ.16 కోట్ల వరకు తీసుకున్నాడట. తదుపరి మూవీకి రూ.20 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాడట.
Hero Nani:దసరా (dasara) మూవీ హిట్‌తో హీరో నాని (nani) జోష్ మీద ఉన్నాడు. తన రెమ్యునరేషన్ మరోసారి పెంచేశాడు. దసరాకు (dasara) సినిమాకు ముందు కాస్త తక్కువే ఉండేది. దసరా హిట్ అవడంతో రూ.16 కోట్ల వరకు తీసుకున్నాడట. ఇక సినిమాకు మంచి మార్కెట్ ఉందని.. వచ్చే సినిమాకు మరోసారి రెమ్యునరేషన్ (remuneration) పెంచారని తెలిసింది. తదుపరి మూవీకి రూ.20 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నాడట.
సినిమాలు పాన్ ఇండియా (pan india) స్థాయిలో విడుదల అవుతున్నాయని నాని (nani) చెబుతున్నాడు. అందుకే తన పారితోషికం (remuneration) పెంచాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. ఓటీటీ (ott), శాటిలైట్ హక్కులకు మంచి డిమాండ్ ఉంటుందని వివరించాడు. అందుకే రెమ్యునరేషన్ (remuneration)పెంచాల్సి వస్తోందని సమాచారం. అలా చేయడం తప్పేమి కాదని.. మార్కెట్ మేరకు పెంచుతున్నానని నాని చెబుతున్నాడట.
నాని (nani) మూవీ అంటే పెట్టిన నగదు వస్తోందని ధీమా నిర్మాతకు ఉంటుంది. అందుకే అతనితో సినిమాలు (cinema) చేయడానికి ప్రొడ్యూసర్స్ (producer) కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మూవీ కూడా తొందరగా ఫినిస్ చేయడం వల్ల వెంటనే రెవెన్యూ (revenue) జనరేట్ అవుతుందనే మరో కోణం ఉంది. అందుకోసమే నాని (nani) డిమాండ్ చేసినంత ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. దసరా (dasara) మూవీ తర్వాత.. నాని రూ.4 కోట్ల పారితోషికం పెంచేశారు. ఇటు దసరా మూవీ కూడా కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ఇండియాలోనే కాక.. అమెరికాలో కూడా రికార్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి.