ప్రముఖ నటుడు నిర్మాత నాగబాబు (Naga Babu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమాజంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారని పూర్వకాలం జనరేషన్లో అడ్జస్ట్మెంట్ (adjustment), కాంప్రమైజ్ లు ఎక్కువగా ఉండేవని అన్నారు.ప్రస్తుతం కాలంలో అలాంటివేవీ కనిపించడంలేదని అన్నారు. ఉమ్మడి కుటుంబలు లేకపోవడంతో ఎక్కడ చూసిన బ్రేకప్లే (break) కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.దీనికి ప్రధాన కారణం నేటి జనరేషన్ అమ్మాయిల, అబ్బాయిల మైండ్ సెట్ అని చిన్న చిన్న విషయాలకే డివోర్స్ వరకు వెళ్తున్నారని అన్నారు.
ఇక అబ్బాయిల మైండ్ సెట్ పూర్తిగా డెవలప్ అవ్వడం లేదని, ఇక అమ్మాయిలేమో మీరు సర్దుబాటు అవుతారేమో, కాని మేము కాలేము అని డైరెక్ట్ (Direct)గా చెప్పేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా భార్య భర్తలు ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నప్పుడు భార్య మరింత రేంజ్ లో సంపాదిస్తే నేను ఎందుకు సర్దుకుపోవాలి అనే ప్రశ్న ఎక్కువగా వారి మధ్య వినిపిస్తోందని నాగబాబు తెలిపారు. అయితే ఈ మేటర్ అంతా తన కూతురి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టు తెలుస్తోంది.నిహారిక (Niharika) , చైతన్యల పెళ్లి 2020లో రాజస్థాన్లో హిందూ సాంప్రదాయ పద్దతుల్లో జరిగింది. కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి. ఇద్దరూ పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకున్నారు