లైగర్ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ సినిమా పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కింది. అంతేకాదు ఇద్దరికీ భారీ బడ్జెట్ ఫిల్మ్ ఇదే. అలాగే తన కెరీర్లో మొదటిసారి లైగర్ కోసం మూడేళ్లు కేటాయించాడు పూరి. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గురించి.. ఈయనను తొలిసారి ఇండియన్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన ఘనత పూరిదే. దీనికోసం చార్మి ఎంతో కష్టపడినట్టు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు పూరి. ఇక విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ డమ్ అవడం కోసం చేసిన హార్డ్ వర్క్ తెరపై కనిపిస్తునే ఉంది. ఇదే కాదు ఇంకా ఎన్నో స్పెషాల్టీస్ ఉన్న లైగర్.. బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అసలు ఈ సినిమా వసూళ్లు ఎంత అనేది పక్కన పెడితే.. నెగెటివిటీనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. దాంతో పూరికి ఇది భారీ దెబ్బే అని చెప్పాలి.
అయితే తాజాగా లైగర్ క్లైమాక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. క్లైమాక్స్‌లో మైక్ టైసన్‌ను తీసుకోవడంతో.. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్. మైక్ టైసన్‌కు ఏకంగా 25 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. లైగర్‌లో టైసన్ది జస్ట్ క్యామియో రోల్ మాత్రమే. దానికే అన్ని కోట్లు ఇచ్చారంటే.. ఈ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక్క మైక్ టైసన్కే పాతిక కోట్లిస్తే.. విదేశాల్లో చిత్రీకరించిన ఈ ఫైట్ కోసం చేసిన మిగతా ఖర్చులు అదనం అని చెప్పాలి. కానీ సినిమాలో మెయిన్ మైనస్ క్లైమాక్స్ అనే టాక్ జనాల్లో ఉంది. కాబట్టి ఈసారి పూరి పెన్ ఎక్కడో తేడా కొట్టిసిందనే చెప్పొచ్చు. మరి లైగర్ రిజల్ట్‌తో పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.