సూపర్ స్టార్ మహేష్ బాబుకు మేనమామ, సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా బావ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (73) నిన్న రాత్రి మృతిచెందారు. ఈయన హీరో కృష్ణ చెల్లెలు భర్త. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీలో పలువురు నివాళి అర్పించారు.
సూపర్ స్టార్ కృష్ణతో రామ్ రాబర్ట్ రహీం, సంధ్యా, బజారు రౌడీ లాంటి సినిమాలు పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. హీరో కృష్ణపై ఉన్న అభిమానంతో తన మనవడికి అభినవ కృష్ణ అని పేరు పెట్టుకున్నారు. కృష్ణ మృతి తరువాత మానసికంగా ఎంతో కృంగిపోయిన సూర్యనారాయణ బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సైతం పెను సంచలనం సృష్టించారు సూర్యనారాయణ బాబు. తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామా రావు పై పోటీ చేశారు. ప్రొడ్యూసర్ సూర్యనారాయణ బాబు మృతి పట్ల ఇండస్ట్రీలో పలువురు నివాళి అర్పించారు.