Raamabanam : గోపీచంద్ ‘రామబాణం’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో గోపీచంద్(Gopichand) రామబాణం(Raamabanam) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆడియన్స్ ముందుకు వస్తోంది. శ్రీవాస్(Srivas) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో గోపీచంద్(Gopichand) రామబాణం(Raamabanam) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆడియన్స్ ముందుకు వస్తోంది. శ్రీవాస్(Srivas) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో లక్ష్యం, లౌక్యం వంటి సినిమా తెరకెక్కాయి. ఆ సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. మరోసారి వీరి కాంబోలో వచ్చే సినిమా కూడా హిట్టు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్స్ ను కూడా చిత్ర యూనిట్ చేపడుతోంది.
‘రామబాణం’ నుంచి లిరికల్ సాంగ్:
తాజాగా ఈ సినిమా(Movie) నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, స్పెషల్ పోస్టర్లు మూవీపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ మధ్యనే ఐఫోన్ అనే పాట రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ (Second Single)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట ఓ గుడిలో జరిగే ఉత్సవం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది.
”దరువు వెయ్యారా, చిందెయ్యరా, పంబ రేగాలంటూ” ఈ పాట(Song) సందడిగా సాగుతుంది. ఈ సాంగ్ లో హీరో గోపీచంద్(Hero Gopichand), హీరోయిన్ డింపుల్(Dimple) వేసే స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కృష్ణ తేజస్వి, చైత్ర అంబడిపూడి ఈ పాటను పాడారు.
రామబాణం మూవీ(Raamabanam Movie) వేసవి కానుకగా మే 5వ తేదిన రిలీజ్(Release) కానుంది. ఈ సినిమాకు భూపతి రాజా కథను అందించారు. అలీ, నాజర్, వెన్నెల కిషోర్, సప్తగిరి వంటివారు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకూ రిలీజ్(Release) అయిన టీజర్, గ్లింప్స్ ను బట్టి ఈ మూవీ(Movie) ఫాదర్ సెంటిమెంట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.