దుల్కర్ సల్మాన్(Dulquer Salmaam), ఐశ్వర్య లక్ష్మి(Iswarya Lakshmi) జంటగా నటిస్తున్న తాజా మూవీ ‘కింగ్ ఆఫ్ కోటా’ (King Of Kotha Movie). ఈ చిత్రం టీజర్(Teaser)ను టాలీవుడ్(Tollywood) సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘కింగ్ ఆఫ్ కోటా’ టీజర్‌ను రిలీజ్(Teaser Release) చేయడం ఆనందంగా ఉందన్నారు. దుల్కర్ సల్మాన్ మరోసారి అద్భుతమైన పాత్రలో కనిపిస్తున్నాడని అన్నారు. చిత్ర బృందానికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
‘కింగ్ ఆఫ్ కోటా’ టీజర్:
‘కింగ్ ఆఫ్ కోటా’ మూవీ టీజర్(King Of Kotha Movie) విడుదల సందర్భంగా దుల్కర్ సల్మాన్(Dulquer Salmaam) మహేష్ బాబు(Mahesh Babu)కు ధన్యవాదాలు తెలిపారు. “థాంక్యూ సో మచ్ అన్నా” అంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీకి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో డాన్సింగ్ రోజ్ షబీర్, ప్రసన్న, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ 80, 90వ దశకాల బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది.