నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎన్టీఆర్ 30(NTR 30) నుంచి బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి జపాన్ టూర్లో ఉన్నారు. అక్టోబర్ 21న జపాన్‌లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా.. ప్రమోషన్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు.. ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నారు ఈ ముగ్గురు.
ఇక ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్నాడు. త్వరలోనే ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ స్టైలిష్ లుక్కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు తారక్ తిరిగొచ్చాక ఎన్టీఆర్ 30 అప్టేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్‌ను కొరటాల కంప్లీట్ చేశారని తెలుస్తోంది. దాంతో త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతందని చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ అండ్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీపావళి కానుకగా ఈ బిగ్ ట్రీట్ ఇచ్చేందుకు కొరటాల కసరత్తులు చేస్తున్నాడట. ఆ రోజు టైటిల్‌తో పాటు హీరోయిన్, మిగతా స్టార్ క్యాస్టింగ్‌ను కూడా రివీల్ చేయబోతున్నారట. ఇక ఆ తర్వాత వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. రేపో, మాపో దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.