»In The Latest Promo Of Bigg Boss Shakila And Shivaji Scared Everyone That There Is A Ghost Together
Bigg Boss: బిగ్ బాస్ దెయ్యం
గత సీజన్ కన్నా బిగ్ బాస్ 7 కాస్త బెటర్‌గానే ఎంటర్టైన్ చేస్తోంది. తాజా ప్రోమోలో శివాజీలో మరో కోణం బయటకు వచ్చింది. ఏకంగా సామెతలు చెబుతూ చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. ఇక హౌస్‌లో లవ్ ట్రాక్ కూడా ఒకటి మొదలైనట్లు తాజా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది.
Bigg Boss: తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-7 (Bigg Boss Telugu 7)లో రసవత్తరంగా సాగుతుంది. లేటెస్ట్గా టాస్క్‌ల ఘట్టం మొదలైంది. సందీప్(Sandeep), ప్రియాంక(Priyanka), రతిక(Rathika), శివాజీలు(Shivaji) పవర్ అస్త్రాన్ని సాధించడానికి అతి చేరువలో ఉన్నారు అంటూ బిగ్‌బాస్ ప్రకటించి, ఆ నలుగురిలో అస్త్రానికి ఎవరు అనర్హులో తెలపాలని ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు. దీంతో పోటీదారులంతా వారి అభిప్రాయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆ నలుగురి ఎదుట ఉన్న టైమ్ బాక్సును ఇసుకతో నింపాలని సూచించాడు. రతిక అనర్హురాలంటూ పలువురు హౌస్మేట్స్ ఆమెను ఎలిమినేట్ చేసేందుకు క్యూకట్టారు. దీంతో రతిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దామిని, రతికల మధ్య మాటల యుద్ధం జరిగింది. మాట్లాడేటప్పుడు అదుపులో ఉండాలని దామినికి రతిక వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు తనని టాస్క్ నుంచి అనర్హుడిగా ప్రకటించేందుకు యత్నించిన వారికి శివాజీ తెలుగు సామెతలతో కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. మరో ప్రోమోలో గౌతమ్ కృష్ణకు రితిక నడుమ లవ్ ట్రాక్‌ను చూపించారు. మరీ వారి ఇద్దరి నడుమ ఏం ఉందో తెలియాలంటే ఈరోజు షోను చూడాల్సిందే. అలాగే తాజాగా విడుదలైన ప్రోమోలో షకీలాకు దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంది. ఇది కావాలనే చేస్తున్నారా లేదా అనేది తెలియాలంటే షో చూడాల్సిందే.