ప్రస్తుతం బడా బడా హీరోలు సైతం.. నెగెటివ్ రోల్ చేసేందుకు సై అంటున్నారు. తాజాగా హీరో విశాల్ కూడా విలన్‌గా మారబోతున్నాడట. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. గతంలో విజయ్ ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతిని విలన్‌గా చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’లోను మరోసారి విజయ్(Vijay) సేతుపతినే విలన్‌గా తీసుకున్నాడు. అయితే స్టార్ హీరో సూర్యను కూడా విక్రమ్ క్లైమాక్స్‌లో విలన్ రోల్లో రోలెక్స్‌గా చూపించి.. సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు.
ఇక ఇప్పుడు విశాల్‌ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ వంటి సంచలనం తర్వాత.. కోలీవుడ్ హీరో విజయ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు లోకేష్. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో.. ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. విజయ్‌కు విలన్‌గా విశాల్‌తో చర్చలు జరుపుతున్నాడట లోకేష్.
విశాల్(Vishal) కూడా ఈ మధ్య కాలంలో సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు.. పైగా విశాల్‌కు విభిన్నమైన పాత్రలు చేయడం అంటేనే ఇష్టం. ఆ ఆసక్తితోనే లోకేష్-విజయ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ రావడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం హీరోగా లాఠీ, మార్క్ అంటోని వంటి సినిమాలు చేస్తున్నాడు విశాల్. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఏదేమైనా.. విశాల్ విలన్‌గా చేస్తే మాత్రం ఆ క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెప్పొచ్చు.