తమ అభిమాన హీరోల వారసులు.. ఎప్పుడెప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతానికి బాలయ్య, పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ వారసులు తెరంగేట్రానికి రెడీగా ఉన్నారు. కాస్త లేట్ అయినా కూడా.. వీళ్లు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. అయితే ప్రజెంట్ ఘట్టమనేని అభిమానులు మాత్రం.. ఈ విషయంలో ఖుషీ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటున్నాడు. అయితే అప్పుడప్పుడు మహేష్ కూతరు సితార సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది.. కానీ గౌతమ్ మాత్రం కాస్త సైలెంట్‌గా ఉంటాడు.. ఎక్కడా ఎక్కువగా కనిపించడు.. ఎక్కువగా మాట్లాడడు. కానీ తండ్రికి తగ్గ తనయుడిగా.. 8 ఏళ్ల వయసులోనే ‘వన్ నేనొక్కడినే’ చిత్రంలో నటించాడు గౌతమ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినా.. మహేష్, గౌతమ్‌ను బిగ్ స్క్రీన్ పై చూసి మురిసిపోయారు అభిమానులు. ఇక ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు గౌతమ్. కానీ ఇప్పుడు టీనేజ్‌లో ఉన్న గౌతమ్ వీడియో చూస్తే హీరోగా రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా తన స్నేహితులతో కలిసి గౌతమ్ చేసిన ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియోని నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. ఈ స్టేజ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు గౌతమ్.. ఆ కటౌట్ చూసి అచ్చం మహేష్ బాబులా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా చదువుతో పాటు హీరో అయ్యేందుకు గౌతమ్ దృష్టి పెట్టాడని ఈ వీడియోను చూస్తే చెప్పొచ్చు.