సుడిగాలి సుధీర్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర హీరోగా రాణిస్తున్న సుధీర్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా రాణిస్తున్నాడు. రీసెంట్గా గాలోడుగా వచ్చిన సుడిగాలి సుధీర్.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా మారిన సుధీర్.. ఆ తర్వాత త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్.. అనే సినిమాలు చేశాడు. ఫస్ట్ సినిమా ఫర్వాలేదనిపించినా..
మిగతా రెండు సినిమాలతో మెప్పించలేకపోయాడు సుధీర్. దాంతో ఈ సారి మాస్ ఆడియెన్స్ టార్గెట్‌గా ‘గాలోడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక ఈ సినిమాతో సుధీర్ మంచి హిట్ అందుకున్నాడనే చెప్పాలి. గాలోడు కలెక్షన్లు చూసి.. టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఫస్ట్ డేనే గాలోడు మూవీ ఒక కోటికి పైగా గ్రాస్ అందుకున్నట్టు టాక్. ఇక వీకెండ్లో గాలోడు మరింత రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. శనివారం కోటి రూపాయలు..
ఆదివారం కోటిన్నరకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మూడు రోజుల్లో దాదాపు నాలుగు కోట్ల వరకు ‘గాలోడు’ గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ టాక్. దాంతో పోయిన వారం రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ‘గాలోడు’ నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ సినిమా బిజినెస్ రెండున్నర కోట్లకు పైగా జరిగిందని.. ఈ వీక్‌లోను వసూళ్లు స్టడీగా ఉంటే..
గాలోడు బ్రేక్ ఈవెన్ అయినట్టేనని అంటున్నారు. దీనికి కారణం.. గత రెండు వారాలుగా యశోద మినహా పెద్ద సినిమాలు లేకపోవడమేనని అంటున్నారు. అలాగే బుల్లితెరపై సుధీర్ క్రేజ్ మరింతగా కలిసొచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం సుధీర్ ఈ సినిమా సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు.