TG: సినిమా థియేటర్ తనకు గుడిలాంటిదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటన బాధాకరం.. ఇందులో ఎవరి తప్పు లేదని తెలిపారు. ఆరోజు జరిగింది ప్రమాదమని, దానికి తామంతా బాధపడ్డామని పేర్కొన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.. బాలుడి హెల్త్ అప్డేట్ని ప్రతిరోజూ తెలుసుకుంటున్నాని అల్లు అర్జున్ తెలిపారు. ప్రభుత్వంతో తాము ఎలాంటి వివాదం కోరుకోవడం లేదన్నారు.