Adipurush: ‘ఆదిపురుష్’కి దిల్ రాజు షాక్.. రంగంలోకి మరో సంస్థ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో.. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ కోసం.. ఫాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఆదిపురుష్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ విషయంలో భారీ ఎత్తున చేతులు మారింది. తాజాగా దిల్ రాజు ఆదిపురుష్‌కి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆదిపురుష్(Adipurush) ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 432 కోట్లను రికవరీ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆదిపురుష్.. రిలీజ్‌కు ముందే పెట్టిన బడ్జెట్లో దాదాపు 85 శాతం రికవరీ చేసిందని అంటున్నారు. శాటిలైట్, ఆడియో, డిజిటల్ రైట్స్.. మొత్తంగా నాన్ థియెట్రికల్ రైట్స్ 247 కోట్లకు అమ్ముడు పోయినట్టు టాక్. ఇక సౌత్ స్టేట్స్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు.
దాదాపు 185 కోట్లు చెల్లించి యూవీ క్రియేషన్స్ నుంచి రైట్స్ తీసుకున్నారు. దీంతో నష్టాల్లో ఉన్న యూవీ క్రియేషన్స్ నిర్మాతలు గట్టేక్కేశారు. తెలుగు రాష్ట్రాల్లో 155 కోట్ల బిజినెస్ జరిగింది. నైజాంలో 60 కోట్లు, ఆంధ్ర 70 కోట్లు, సీడెడ్ 25 కోట్లు కాగా.. మిగిలిన తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 30 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగింది. అయితే ఇప్పుడు నైజాం ఏరియా నుంచి దిల్ రాజు తప్పుకున్నట్టు తెలుస్తోంది. ముందు నుంచి ఆదిపురుష్ నైజాం హక్కులను దిల్ రాజు తీసుకోవాలని అనుకున్నారు.
కానీ తాజాగా దిల్ రాజు తప్పుకోవడంతో.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నిర్మాతలు భారీగా డిమాండ్ చేయడంతోనే దిల్ రాజు ‘ఆదిపురుష్’పై పెద్దగా ఆసక్తి చూపించలేదని వినిపిస్తోంది. అయితే ఆదిపురుష్ పై దిల్ రాజుకి నమ్మకం లేదా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇటీవల ‘శాకుంతలం’ ఫ్లాప్ వల్ల దిల్ రాజుకి భారీగా నష్టాలు వచ్చాయి. దాంతో రిస్క్ అవసరమా? అనుకున్నాడో ఏమో గానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.