ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి సాయి పల్లవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘శ్యామ్ సింగరాయ్ షూట్ చాలా వరకూ రాత్రి పూటే చిత్రీకరించారు. రాత్రి షూటింగ్లు నాకు అస్సలు అలవాటు లేదు. దాదాపు 30 రోజులు తెల్లవారే వరకూ మేల్కొని ఉండాల్సి వచ్చేది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఒకరోజు రాత్రి నన్ను చూడటానికి నా చెల్లి పూజా వచ్చింది. తనతో మాట్లాడుతున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు.. ఒక్కసారిగా ఏడ్చేశాను’ అని తెలిపారు.