బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాలతో టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ను సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ సినిమాలు ప్రస్తుతం అనుకున్నంత విజయాన్ని ఇవ్వట్లేదు. అయితే తమిళంలో విడుదల చేసిన చిత్తా సినిమాను తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేశారు. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూద్దాం.
హీరో సిద్ధార్థ్ , తమిళ దర్శకుడు ఎస్.యు.అరుణ్‌కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘చిన్నా’. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా తప్పకుండా హిట్ అవుతుందని హీరో సిద్ధార్థ్ ఇటీవల జరిగిన చిన్నా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పాడు. ఈ సినిమా ‘మీకు నచ్చేలేదంటే ఇకపై నేను తెలుగు ఇండ్రస్టీకి రాను, నా సినిమాలను కూడా తెలుగులో విడుదల చేయనని అన్నాడు. అలాగే సిద్ధార్థ్ సినిమాలు ఎవరు చూస్తారని కొంతమంది అన్నారని ‘చిన్నా’ వేడుకలో సిద్ధార్థ్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉందో? సిద్ధార్థ్ ప్రేక్షకులను మెప్పించాడా లేదా రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మధ్యతరగతి కుటుంబానికి చెందిన హీరో ఈశ్వర్ ఆలియాస్ చిన్నా (సిద్ధార్థ్) మున్సిపాలిటీలో ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. అకస్మాత్తుగా అన్నయ్య చనిపోవడంతో వదిన, కూతురు బాధ్యతలన్నింటిని చిన్నా తీసుకుంటాడు. అన్నయ్య కూతురు సుందరి ఆలియాస్ చిట్టి(సహస్ర శ్రీ) అంటే చిన్నాకు చాలా ఇష్టం. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో చిన్నాపై ఒక నింద పడుతుంది. చిట్టి స్నేహితురాలైన మున్నిని చిన్నానే లైంగిక దాడి చేశాడని ఆరోపణలతో పాటు సాక్ష్యాలు కూడా ఉంటాయి. చిట్టి కూడా తర్వాత కనిపించదు. చిట్టి కనిపించకపోవడానికి కారణాలు ఏంటి? ఆ లైంగిక దాడి చేసింది చిన్నానా లేకపోతే ఇంకేవరా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ప్రస్తుత సమాజంలో చిన్నారులపై ఎక్కువగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లని సురక్షితంగా ఎలా ఉంచాలి. వాళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్ చట్ బ్యాడ్ టచ్ గురించి చిన్నప్పటి నుంచే పిల్లలకు తెలియజేయాలి వంటి విషయాలన్నీ సినిమాలో చూపించారు. సినిమా ప్రథమార్థంలో చిన్నాన్నకు, చిట్టికి మధ్య ఉన్న బంధం గురించి చక్కగా చూపించారు. చిన్నా(సిద్ధార్థ్) మున్నిపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణే ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్. ద్వితీయార్థంలో కేసు, నిందితుడిని వెంటాడే సన్నివేశాలు కొంచెం థ్రిల్‌గా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగితే వీటి నుంచి పిల్లలను బయటకు తీసుకురావడం చాలా ముఖ్యం. పిల్లలను ఎలా ఇలాంటి సంఘటనల నుంచి బయటకు తీసుకురావాలని కొన్ని సన్నివేశాలను చూపించారు.
ఎవరెలా చేశారంటే?
లవర్ బాయ్ వంటి పాత్రలు చేసే హీరో చిన్నా(సిద్ధార్థ్) ఈసారి పూర్తి భిన్నంగా ఉండే క్యారెక్టర్ చేచేశాడు. చిన్నా పాత్రకు హీరో సిద్ధార్థ్ న్యాయం చేశారు. అంజలి నాయర్ ఈశ్వర్ వదిన పాత్రలో కనిపిస్తుంది. సహస్ర, సబియాతోపాటు పలువురు వాళ్ల నటనతో వారి క్యారెక్టర్ల పరిధి మేరకు యాక్ట్ చేశారు.
సాంకేతిక అంశాలు
విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం సినిమాకి హైప్ ఇచ్చిందని చెప్పవచ్చు. కెమెరా, ఎడిటింగ్ కూడా చక్కగా ఉంది. సినిమా అంత సహజంగా కనిపిస్తూ మనస్సును హత్తుకునేలా ఉంటుంది. మిగతా టెక్నిషీయన్ల పనితీరు కూడా పర్వాలేదనిపిస్తుంది.
ప్లస్ పాయింట్లు
+కథ, కథనం
+ ఆకట్టుకున్న సిద్ధార్థ్ నటన
+సంగీతం
+ ఎమోషనల్‌గా చూపించడం