యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) తీసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్'(ISmart Shankar) బాక్సాఫీస్ బరిలో సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. భారీ వసూళ్ళను సాధించింది. ఆ మూవీ ఎండింగులో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ (Hero Ram) పోతినేని బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల (Srilila) హీరోయిన్గా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఓవైపు ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే.. మరో సినిమాను స్టార్ట్ చేశారు రామ్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు ఈ స్టార్ హీరో. 2019లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం జతకడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమా అధికారికంగా ఆ మూవీని లాంచ్ అయింది. ఛార్మి (Charmy) క్లాప్ బోర్డ్ కొట్టగా.. హీరో రామ్ పై పూరి జగన్నాధ్ స్వయంగా యాక్షన్ చెప్పారు. “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్” అంటూ స్టైల్ గా మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూలై 12 నుంచి స్టార్ట్ కానుంది. ఈ మూవీ వచ్చే ఏడాది మహా శివరాత్రి (Maha Shivratri)సందర్భంగా మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ , ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవో (Vishu Reddy CEO)గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. సోమవారం ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాథ్, రామ్, ఛార్మి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది చిత్రయూనిట్. త్వరలోనే సినిమా షూటింగ్ వెళ్తున్నట్లు సమాచారం.